పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రమే “హరిహర వీరమల్లు”. పవన్ నుంచి మొదటి పాన్ ఇండియా కం వారియర్ రోల్ సినిమాగా ఇది తెరకెక్కగా భారీ అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు ఆల్రెడీ హిట్ కాగా నేడు మూడో సాంగ్ అందులోని పవర్ఫుల్ సాంగ్ ని లాంచ్ చేస్తుండడం విశేషం.
అయితే ఈ సాంగ్ ఖచ్చితంగా సినిమాకి మంచి బూస్టప్ గా నిలవబోతుంది అని తెలుస్తుంది. అలాగే కీరవాణి నుంచి ఆల్రెడీ వచ్చిన కొన్ని బీట్స్ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేసాయి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ఏకంగా 50 సార్లు ఈ సాంగ్ విన్నానని చెప్పడం కూడా జరిగింది. దీనితో ఇపుడు అందరి కళ్ళు ఈ సాంగ్ మీదే ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సాంగ్ ఈ ఉదయం 11 గంటల 55 నిమిషాలకి రిలీజ్ కానుంది. అలాగే సినిమా ఈ జూన్ 12న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.