అందరికళ్ళూ బసంతిపైనే

basanti1

బ్రహ్మానందం తనయుడు గౌతం ఇప్పుడు బసంతి సినిమాపై అన్ని ఆశలు పెట్టుకున్నాడు. చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకుడు. విరామం తరువాత వస్తున్న గౌతం కు ఈ సినిమా మరపురాని చిత్రంగా తీర్చిదిద్దుతున్నాడు. గతంలో గౌతం పలు సినిమాలలో నటించినా అవి పరాజయంపాలయ్యాయి

తెలుగు సినిమా రంగంలో వున్నా అగ్ర తారలు, ప్రముఖుల చేత ఈ సినిమా ప్రచారం చేయించాడు బ్రహ్మానందం. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టీ.ఆర్, రామ్ చరణ్ వంటి తారలేకాక, రాజమౌళి, వి.వి వినాయక్ వంటి ప్రముఖులు సైతం ఈ సినిమాను ప్రోత్సహించారు. ఇటీవలే బ్రాహ్మీ మాట్లాడుతూ “గౌతమే నాకున్న ఏకైక ఆస్తి. ఈ సినిమాతో నన్ను గర్వపడేలా చేస్తాడు” అని అన్నారు

ఈ సినిమాలో నడిచే కదాంసానికి తగ్గట్టుగా గౌతం తన బాడీని మార్చుకున్న తీరు అభినందనీయం. టెర్రరిజం, రొమాన్స్ చుట్టూ సాగే ఈ చినెమకూ మణిశర్మ సంగీతాన్ని అందించాడు. గౌతం కెరీర్ కే మెయిన్ టర్న్ గా మారనున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుందాం

Exit mobile version