గబ్బర్ సింగ్ విడుదలకు రంగం సిద్ధం

గబ్బర్ సింగ్ విడుదలకు రంగం సిద్ధం

Published on May 8, 2012 2:15 PM IST


గబ్బర్ సింగ్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ రోజు ప్రారంభమైన ఈ చిత్రానికి గాను సెన్సార్ సభ్యుల బృందం యు/ఎ సర్టిఫికేట్ అందించింది. ఈ విషయాన్నీ నిర్మాత గణేష్ బాబు స్వయంగా తెలియజేసారు. ఈ నెల 11న భారీ విడుదలకు అన్ని హంగులు సిద్ధం చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో అజయ్, అభిమన్యు సింగ్, సుహాసిని, కోట శ్రీనివాస రావు, అలీ, నాగినీడు, తనికెళ్ళ భరణి మొదలగు వారు నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ బాబు నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు