పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే “ఓజి”. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఇపుడు 300 కోట్ల క్లబ్ దిశగా వెళుతుంది. అయితే ఈ సినిమా కోసం చూసిన ఫ్యాన్స్ కి మరో కొత్త ట్రీట్ ని సాంగ్ గా మేకర్స్ నిన్న సాయంత్రం షోస్ నుంచి అందించిన సంగతి తెలిసిందే.
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అంటూ సాగే ఈ సాంగ్ ని యంగ్ బ్యూటీ నేహా శెట్టిపై తెరకెక్కించగా దీనికి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ ఇచ్చిన బీట్స్ దీనికి కూడా అదరడంతో అఫీషయల్ ఆడియో సాంగ్ కోసం ఇపుడు అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరి దీనిని కూడా మేకర్స్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రేయ రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు నటించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు.