హైదరాబాద్ అన్నపూర్ణ 7ఏకర్స్ వేదికలో జూన్ 9న ‘అలియాస్ జానకి’ ఆడియో విడుదలకానుంది. యాక్షన్ డ్రామాగా సాగే ఈ సినిమాలో వెంకట్ రాహుల్ మరియు అనీష అంబ్రోస్ ముఖ్యపాత్రధారులు.
గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో పనిచేసిన దయ్యా కె ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్యే విదుదలైంది. దానికి వచ్చిన స్పందనను చూసిన చిత్ర బృందం ఆనందంలో ఉన్నారు. వెంకట్ రాహుల్ చేసిన యాక్షన్ సీన్లు ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తాను వాస్తవంలో చుసిన కొన్ని సంఘటనల కారణంగా సాదాసీదాగా జీవనం సాగిస్తున్న వ్యక్తి హింసాత్మక దారిని ఎంచుకున్న నేపధ్యంలో కధ నడుస్తుంది. సుజిత్ సినిమాటోగ్రాఫర్. శ్రవణ్ సంగీతం అందించాడు. సంగమిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై నీలిమ తిరుమలశెట్టి ఈ సినిమాను నిర్మించారు