జూలైలో విడుదలకు సిద్ధమవుతున్న అలియాస్ జానకి

జూలైలో విడుదలకు సిద్ధమవుతున్న అలియాస్ జానకి

Published on Jun 18, 2013 8:40 PM IST

Alias-Janaki
‘అలియాస్ జానకి’ సినిమాకు మంచి ఆడియో కారణంగా ఇండస్ట్రీలో గుర్తింపు లభించింది. ఈ సినిమా జూలై 12న విడుదలకు సిద్దమవుతుంది.

యాక్షన్ డ్రామాగా సాగే ఈ సినిమాలో వెంకట్ రాహుల్ మరియు అనీష అంబ్రోస్ ముఖ్యపాత్రధారులు.
గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో పనిచేసిన దయ్యా కె ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ రాహుల్ చేసిన యాక్షన్ సీన్లు ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తాను వాస్తవంలో చుసిన కొన్ని సంఘటనల కారణంగా సాదాసీదాగా జీవనం సాగిస్తున్న వ్యక్తి హింసాత్మక దారిని ఎంచుకున్న నేపధ్యంలో కధ నడుస్తుంది.

సుజిత్ సినిమాటోగ్రాఫర్. శ్రవణ్ సంగీతం అందించాడు. సంగమిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై నీలిమ తిరుమలశెట్టి ఈ సినిమాను నిర్మించారు

తాజా వార్తలు