అలియా రోల్ అందుకే చాలా కీలకం..!

దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్ వన్డర్ ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుందా, చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. ఇటీవలే చరణ్ పుట్టిన రోజు కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుండి చరణ్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో కండలు తిరిగిన బాడీతో ఉన్న చరణ్ ఫెరోషియష్ లుక్ కేకపుట్టించింది. కాగా మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా ఆయన ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ వీడియో చిత్ర యూనిట్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

కాగా ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుంది. ఈమె చరణ్ కి ప్రేయసి అయిన సీత అనే పాత్రను పోషిస్తుంది. కాగా అలియా రోల్ ఆర్ ఆర్ ఆర్ లో చాల కీలకం అని అర్థం అవుతుంది. ఈమె చరణ్ లవర్ రోల్ చేస్తున్నప్పటికీ ఎన్టీఆర్ తో కూడా ఈమెకు సన్నివేశాలు ఉంటాయి తెలుస్తుంది. వీరి ముగ్గురి మధ్య ఉద్యమానికి సంబంధించిన కీలక సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఇన్నోసెంట్ అమ్మాయి అయిన అలియా… ఎన్టీఆర్ మరియు చరణ్ మధ్య సంధాన కర్తగా ఉంటుందని వినికిడి.

Exit mobile version