‘ఆర్ఆర్ఆర్’ నుండి ఆలియా తప్పుకోలేదు !

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన నటిస్తోన్న తెలిసిందే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా నుంచి అలియా భట్ తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. పుణెలో జరగాల్సిన షెడ్యూల్‌ లో ఆలియా పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆమె పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అలాగే ఆర్ఆర్అర్ షూటింగ్ డేట్స్ మారడం వల్ల పుణె షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఆలియా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఆలియా ఈ సినిమా నుండి తప్పుకోలేదు. పుణె షెడ్యూల్‌ ను జూన్ నెలలో షూట్ చేయనున్నారు. ఆ షెడ్యూల్ లో ఆలియా షూట్ పాల్గొనబోతుంది.

ఇక వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. అన్నట్టు ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో అజేయ్ దేవగన్ రోల్ వస్తోందట. ఎక్కువుగా ఎన్టీఆర్ కాంబినేషన్ లోనే ఆయన సీన్స్ ఉంటాయట. ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ అనంతరం రాజమౌళి నుండి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version