టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా పవన్ పై అలీ కామెంట్.


దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ మరియు అలీ మంచి మిత్రులుగా ఉంటూ వచ్చారు. వీరి ఘాడమైన స్నేహం మధ్య రాజకీయాలు గోడలు కట్టాయి. గత ఎన్నికలకు ముందు అలీ జనసేన ప్రత్యర్థి పార్టీ వైసీపీ లో చేరారు. దీనితో వీరి మధ్య అంతరం పెరిగింది. అప్పటి నుండి పవన్, అలీ మధ్య మాటలు లేవని ప్రచారం జరిగింది. దానికి తోడు అలీ కూడా పవన్ ని కలిసిన దాఖలాలు కనిపించలేదు.

తాజాగా అలీ ఓ ఆసక్తి ట్వీట్ చేశారు. పవన్ ని ఆయన వ్యక్తిత్వాన్ని పొగుడుతూ అలీ గొప్పగా ట్వీట్ చేయడం జరిగింది. దీనితో అలీ మరలా పవన్ స్నేహాన్ని కోరుకుంటుంటున్నాడని అర్థం అవుతుంది. ఈ విషయాన్ని పరిశ్రమలో ఇప్పుడు విశేషం గా చెప్పుకుంటున్నారు. ఎవరు ముందు స్నేహ అస్తం అందించినా కలవడం అనేది మంచి విషయమే కదా…!

Exit mobile version