కామెడీ స్టార్ అలీ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శబ్దాలయా స్టూడియోస్ లో అలీ హార్ట్ ఎటాక్ సినిమాకి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నితిన్, ఆద శర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఫుల్ ఫాంలో ఉన్న నితిన్ కి ఈ సినిమా మరో హిట్ ఇస్తుందని ఆశిస్తున్నాడు.