అల్లు అర్జున్ యొక్క ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇంకా పలుచోట్ల మంచి రన్ అందుకుంటోంది. అన్ని చిత్రాల్ని పక్కకు నెట్టి కంప్లీట్ డామినేషన్ కనబరుస్తోంది. కలెక్షన్ల విషయంలో ప్రత్యేకంగా ప్రస్తావించుకునే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అయితే రికార్డ్ వసూళ్లు రాబడుతోంది. ఈరోజు వసూళ్ల విషయమే తీసుకుంటే ‘సరిలేరు నీకెవ్వరు’, గత వారం విడుదలైన ‘డిస్కో రాజా’ల కంటే మెరుగైన కలెక్షన్స్ సాధిస్తోంది.
ఈరోజు మార్నింగ్ షోకు సంధ్య 35ఎమ్ఎమ్ నందు బన్నీ చిత్రం రూ.21,752, మ్యాటనీకి రూ.27,683, ఫస్ట్ షోకి రూ.44,600 వసూలు చేయగా మహేష్ చిత్రం సుదర్శన్ నందు మార్నింగ్ షోకు రూ.15,187,
మ్యాటనీకి రూ.22,741, ఫస్ట్ షోకు రూ.31,471 వసూలు చేసింది. ఇక ‘డిస్కో రాజా’ సంధ్య 70 ఎమ్ఎమ్ నందు మార్నింగ్ షోకు రూ.7668, మ్యాటనీకి రూ.16,041, ఫస్ట్ షోకు రూ.9861 ఖాతాలో వేసుకుంది. మొత్తం మీద సంక్రాంతి సీజన్ నుండి ఇప్పటివరకు బన్నీ చిత్రం క్రాస్ రోడ్స్ నందు కంప్లీట్ డామినేషన్ కనబరుస్తోంది.