వన్ మోర్ సక్సెస్ మీట్ అంటున్న ‘అల’ టీమ్

వన్ మోర్ సక్సెస్ మీట్ అంటున్న ‘అల’ టీమ్

Published on Jan 30, 2020 1:46 PM IST

బన్నీకి 2020 సంక్రాంతి మరపురాని విజయాన్ని అందించింది. అల వైకుంఠపురంలో చిత్రం రూపంలో ఆయనకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించింది. బన్నీ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈమూవీ అనేక చోట్ల నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేసింది. ఇక యూఎస్ లో కూడా ఈ చిత్రం బన్నీని $3 మిలియన్ క్లబ్ లో చేర్చింది. ఈ విజయాన్ని నిర్మాతలు అల వైకుంఠపురంలో చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎక్సిబిటర్స్ తో కలిసి సెలెబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించారు. జనవరి 31న డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎక్సిబిటర్స్ తో కూడిన సక్సెస్ మీట్ జరగనుంది. అల వైకుంఠపురంలో మూవీ సక్సెస్ లో భాగమైన డిస్ర్టిబ్యూటర్లు, ఎక్సిబిటర్స్ ని తమ కుటుంబంలా భావించి వారికి కృతజ్ఞత తెలుపుతూ, నిర్మాతలు ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురంలో చిత్రానికి దర్శకత్వం వహించగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మించాయి. థమన్ సంగీతం అందించారు.

తాజా వార్తలు