తనపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన అఖిల్

తనపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన అఖిల్

Published on Jul 25, 2013 1:10 AM IST

Akhil
అక్కినేని వారి వంశంలో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ నటుడిగా తెరంగ్రేటం చెయ్యడానికి సిద్ధంగావున్నాడు. గత కొన్ని నెలలుగా అఖిల్ మొదటి సినిమా కోసం కొందరు ప్రముఖ డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే అఖిల్ ఎంట్రీ ఎప్పుదు అనేది నాగార్జునగారు కుడా ప్రకటించట్లేదు. ఇటీవలే ఒక వర్గం మీడియా అఖిల్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని తెలిపారు. అయితే ఈ పుకార్లను అఖిల్ కొట్టిపారేశాడు. ఈ వార్తకు అఖిల్ స్పందిస్తూ “నేను ఇప్పటిదాకా ఎటువంటి సినిమాను అంగీకరించలేదు. నా మొదటి సినిమాకు సిద్ధపడుతున్నాను” అని తెలిపాడు. అఖిల్ చిన్నతనంలో నాగార్జున నటించిన ‘సిసింద్రి’ సినిమాలో నటించాడు. అఖిల్ హీరోగా నటించనున్న మొదటి సినిమా ఏంటో త్వరలోనే చూద్దాం మరి..

తాజా వార్తలు