అట్టహాసంగా అక్కినేని అఖిల్ వివాహం.. నాగార్జున ఇంట పెళ్లి సంబరాలు

అట్టహాసంగా అక్కినేని అఖిల్ వివాహం.. నాగార్జున ఇంట పెళ్లి సంబరాలు

Published on Jun 6, 2025 12:15 PM IST

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కుటుంబాల్లో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. మరి అక్కినేని కుటుంబంలో కింగ్ నాగార్జున వారసుడు అఖిల్ అక్కినేని పెళ్లిపై గత కొన్ని రోజులు నుంచి వినిపిస్తున్న వార్తల కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ పెళ్లి ఎట్టకేలకు అట్టహాసంగా ఈ జూన్ 6 తెల్లవారు జామున 3 గంటలకి జరిగింది. నూతన వధూవరులు అఖిల్ ఇంకా జైనాబ్ లు వేద మంత్రాలు సాక్షిగా పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

అక్కినేని నాగార్జున స్వగృహంలోనే ఈ పెళ్లి గ్రాండ్ గా జరగడం విశేషం. మరి మెగాస్టార్ చిరంజీవి ఇంకా తన వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ఇంకా పలువురు రాజకీయ నాయకులు సహా బిజినెస్ మ్యాగ్నెట్ పలువురు కూడా హాజరయ్యి కొత్త జంటకి తమ ఆశీస్సులు అందించారు. ఈ ఆదివారం గ్రాండ్ గా రిసెప్షన్ ని ప్లాన్ చేయగా దీనికి మరింతమంది ముఖ్య అతిధులు హాజరు కానున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు