గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ను ఆద్యంతం భారీ యాక్షన్, ఎమోషన్ కలయికలో కట్ చేశారు. ఇండియా బోర్డర్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథలో బోయపాటి ఎలాంటి ట్రీట్మెంట్ అందించబోతున్నాడా అనేది మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తుండగా సంయుక్త హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో హర్షాలి మల్హో్త్రా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
