నెలే ఉంది.. బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ టెన్షన్

నెలే ఉంది.. బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ టెన్షన్

Published on Nov 5, 2025 9:00 AM IST

Akhanda2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో భారీ చిత్రం “అఖండ 2” చేస్తున్న సంగతి తెలిసిందే. మంచి హైప్ ఉన్న ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు ఇప్పుడు గడువు కూడా దగ్గరకు వచ్చేస్తుంది.

కేవలం ఈ నెల మాత్రమే వ్యవధి ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇంకా ఒక్క సాంగ్ కూడా విడుదల చేయకపోవడం అలాగే ప్రమోషన్స్ లాంటివి కూడా స్టార్ట్ చేయకపోవడంతో బాలయ్య అభిమానులు కొంచెం టెన్షన్ గానే ఉన్నారు.

మంచి కంటెంట్ పాన్ ఇండియా ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాకి ఈ గడువు చాలా కీలకం ఈలోపే ఫస్ట్ సింగిల్ లాంటిది వచ్చేసి ఉంటే ఈపాటికే మరింత బజ్ ఉండి ఉండేది. అయినప్పటికీ జాప్యం నెలకొనడంతో బాలయ్య ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ గానే ఉన్నారు.

మరి మేకర్స్ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

తాజా వార్తలు