తమిళ నటుడు అజిత్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీరమ్’ సినిమా అక్కడ పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు అదే సినిమా తెలుగులో డబ్బింగ్ పనులు ముగించుకుని ‘వీరుడొక్కడే’ గా మనముందుకురానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఈనెల 21న విడుదలచేయనున్నారు
ఈ సినిమాను ఓమిక్స్ క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగులో విడుదలచేయనున్నారు. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. శివ తీసిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గనుక ఇక్కడ కూడా విజయంసాధించే అవకాశాలు వున్నాయి. విజయ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్ర తమిళ వెర్షన్ ను నిర్మించింది