స్కూటర్ మెకానిక్ నుండి సూపర్ స్టార్ అయిన అజిత్

స్కూటర్ మెకానిక్ నుండి సూపర్ స్టార్ అయిన అజిత్

Published on Jul 30, 2012 8:40 AM IST


ప్రముఖ వ్యక్తులు కింద స్థాయి నుండి ఎలా ఎదిగారు అన్న కథలను మనం చాలానే వింటూ ఉంటాం. దక్షణాదిన పలువురు నటులు ఇలా వచ్చినవారే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిత్రాలలోకి రాకముందు ఒక డ్రిల్ మాస్టర్ గా పని చేసేవారు, రజిని కాంత్ పరిశ్రమలోకి రాకముందు ఒక బస్ కండక్టర్ గా ఉండేవారు. కానీ మీకు తెలుసా ఈమధ్యనే తెలుగులో “డేవిడ్ బిల్లా” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ స్టార్ అజిత్ వెనక కూడా ఇలాంటి ఒక కథే ఉందని?

నటనలోకి ప్రవేశించకముందు ఆయన ఒక స్కూటర్ మెకానిక్ గా పని చేసేవారు. సికింద్రాబాద్ లో పుట్టిన అజిత్ చదువు అయిపోయాక కాలేజ్ కి వెళ్ళలేదు ఒక స్కూటర్ మెకానిక్ వద్ద బైక్ లను బాగు చెయ్యటం నేర్చుకున్నాడు. తరువాత ఆయన రేస్ కార్ డ్రైవింగ్ లో పాల్గొన్నారు. టివి కమర్షియల్స్ లో కనపడడం మొదలుపెట్టాక తెలుగు పరిశ్రమలో అయన చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.కేవలం రెండు చిత్రాలలో సహాయ పాత్రలు మాత్రమే దక్కాయి. 1993లో లక్ష్మి ప్రొడక్షన్స్ సంస్థ “ప్రేమ పుస్తకం” చిత్రంలో ప్రధాన పాత్ర కోసం అజిత్ ని తీసుకున్నారు. ఆ చిత్రం కోసం అయన “శ్రీకర్” అని పేరు కూడా మార్చుకున్నారు.

తెలుగులో అజిత్ నేరుగా చేసిన చివరి చిత్రం అదే. ఆ తరువాత ఆయన తమిళ పరిశ్రమకి వెళ్ళిపోయారు తరువాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే.

తాజా వార్తలు