స్టార్ హీరో నుండి మరో హాట్ గ్యారంటీ అట !

స్టార్ హీరో నుండి మరో హాట్ గ్యారంటీ అట !

Published on May 3, 2020 11:00 AM IST

కోలీవుడ్ సూపర్ స్టార్స్ లో టాప్ స్టార్ అయిన తల అజిత్ వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ తన స్టామినా ఏమిటో తమిళ్ బాక్సాఫీస్ కి ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఏమైనా అతి పెద్ద మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న అజిత్ చిత్రాలు తమిళంలో వరుస రికార్డ్స్ మీద రికార్డ్స్ సాధిస్తున్నాయి. లాస్ట్ సినిమా విశ్వాసం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన తరువాత నెర్కొండ పార్వై అనే సినిమాలో లాయర్ గా నటించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. కాగా అజిత్ వాలిమై అనే టైటిల్ తో తెరకెక్కుతున్న మరో సినిమాతో కూడా మరో హిట్ అందుకుంటాడని తెలుస్తోంది.

కాగా నెర్కొండ పార్వై సినిమాని తెరకెక్కించిన హెచ్ వినోత్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించడం విశేషం. మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో అజిత్ డ్యూయల్ రోల్ చేశే అవకాశం ఉంది. ఒక పాత్రలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలోని మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. ఏమైనా అజిత్ వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు