కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మగిళ్ తిరుమనేని తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ప్రాజెక్ట్ “పట్టుదల” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ చేసినప్పటికీ ఫైనల్ గా ఇపుడు రిలీజ్ కి రాబోతుంది. మరి తమిళ్ సహా తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకొస్తుండగా ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా మేకర్స్ మంచి అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.
అయితే రీసెంట్ గానే ట్రైలర్ ని కూడా వదలగా ఇపుడు సినిమా నుంచి టైటిల్ ట్రాక్ ని రిలీజ్ చేశారు. మరి ఈ టైటిల్ సాంగ్ మంచి పవర్ఫుల్ గా ఉందని చెప్పాలి. అనిరుద్ అజిత్ కి మరో సాలిడ్ బీట్స్ తో కూడిన ట్రాక్ అందించగా కృష్ణకాంత్ తెలుగులో ఇచ్చిన సాహిత్యం బాగుంది. అజిత్ రోల్ ని మంచి సాహిత్య పదజాలంతో ఎలివేట్ చేశారు. అలాగే తెలుగు వెర్షన్ లో సాత్విక్ జి రావు గొంతు కూడా ఈ సాంగ్ కి సెట్ అయ్యిందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఈ సాంగ్ హిట్టే అని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ ఫిబ్రవరి 6న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి