గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్.. యాక్షన్‌తో అజిత్ వైల్డ్ రైడ్

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ఈ టీజర్ కట్ ఆద్యంతం వైల్డ్ రైడ్‌గా సాగింది. అజిత్ కుమార్‌ను అభిమానులు ఎలాగైతే చూడాలని అనుకుంటారో, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ప్రెజంట్ చేశాడు. ఇక వింటేజ్ లుక్స్‌లో అజిత్ కుమార్‌ని చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఆయన నుంచి వచ్చే డైలాగులు కూడా సాలిడ్‌గా ఉన్నాయి. వైవిధ్యమైన గెటప్స్‌లో అజిత్ చేసే యాక్షన్, ఆయన చూపెట్టిన స్వాగ్ అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి.

ఈ టీజర్‌కు జి.వి.ప్రకాష్ కుమార్ మ్యూజిక్ మేజర్ అసెట్‌గా నిలిచింది. ఇక ఈ టీజర్‌తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version