ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మిస్టర్ బచ్చన్’ ఒరిజినల్ సీక్వెల్

Raid 2 movie review

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రీసెంట్ చిత్రాల్లో గత ఏడాది వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్ కూడా ఒకటి. అయితే ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం రైడ్ కి రీమేక్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుగులో అనుకున్న రేంజ్ లో ఈ చిత్రం హిట్ కాలేదు. అయితే ఎన్నో ఏళ్ళు కితం సినిమా ఇప్పుడు రీమేక్ చేస్తే ఈ రీమేక్ వచ్చే సమయానికే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ రైడ్ కి సీక్వెల్ కూడా సిద్ధం చేసుకున్నారు.

నటుడు అజయ్ దేవగన్ తో చేసిన సీక్వెల్ “రైడ్ 2” ఈ ఏడాది థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో రైడ్ 2 హిందీ సహా పలు విదేశీ భాషల్లో అందుబాటులో ఉంది. మరి మనీ క్రైమ్ థ్రిల్లర్ ని చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version