టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్షకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన గ్రాఫికల్ మానియా ‘ఈగ’. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్లో ‘మక్కీ’ అనే పేరుతో అక్టోబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తన వాయిస్ అందించనున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి గారే తెలిపారు. ‘ నిన్న రాత్రి అజయ్ దేవగన్ ‘మక్కీ’ సినిమాను చూసారు. ఆయనకి చాలా బాగా నచ్చడంతో సినిమా మొదట్లో మరియు చివర్లో వచ్చే తండ్రి పాత్రకి డబ్బించి చెప్పడానికి అంగీకరించారు. ఆయనకి నా ధన్యవాదాలు అని’ రాజమౌళి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటికే తెలుగు మరియు తమిళంలో విజయం సాదించిన ఈ సినిమా హిందీ వెర్షన్ పై ఉన్న అంచనాలు అజయ్ దేవగన్ ఈ చిత్రంలో వాయిస్ అందిస్తున్నాడని తెలియగానే రెట్టింపయ్యాయి. నాని, సమంత మరియు సుధీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.ఎం క్రీమ్(ఎం.ఎం కీరవాణి) సంగీతం అందించారు.