మరో ప్రాజెక్ట్‌ను మొదలుపెడుతున్న అజయ్ భూపతి

‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు.

నవంబర్ 9న తన కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా ప్రకటించారు. నవంబర్ 9న ఉదయం 10:08 గంటలకు తన నాలుగో సినిమా (#AB4) అధికారిక అనౌన్స్‌మెంట్ వస్తుందని తెలిపారు.

కాగా, ఈ సినిమాతో ఇద్దరు స్టార్ కిడ్స్‌ను ఆయన పరిచయం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. వారిలో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు ఘట్టమనేని జయకృష్ణ.. మరొకరు బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రాషా తడాని అని తెలుస్తోంది.

Exit mobile version