కూతురికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్

కూతురికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్

Published on Nov 15, 2012 6:57 PM IST


విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ ముద్దుల కూతురు ఆరాధ్య జన్మించి ఒక సంవత్సరం పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆరాధ్యకి పుట్టిన రోజు కానుకగా ఒక సరికొత్త కారుని బహుమతిగా ఇచ్చారు. రెడ్ కలర్ మిని కూపర్ ఎస్ అనే కారుని అభిషేక్ బచ్చన్ తన కూతురికి బహుమతిగా ఇచ్చారు. నవంబర్ 16 కి ఆరాధ్యకి ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఆరాధ్య జన్మించాక బచ్చన్ ఫ్యామిలీ ఎక్కువగా పబ్లిక్ లో కనపడుతోంది కానీ ఆరాధ్యని పబ్లిక్ లో చూపించకుండా ఉండాలని వారు జాగ్రత్తలు తీసుకున్నా కొద్ది నెలల్లోనే ఆరాధ్య ఫోటో బయటకొచ్చేసింది. అభిషేక్ ఇచ్చిన కారులో అమితాబ్ బచ్చన్ మరియు జయాబచ్చన్ తో కలిసి ఆరాధ్య రైడ్ కి కూడా వెళ్ళింది. ఆరాధ్యని చాలా మంది మంచి అందగత్తె మరియు అదృష్టవంతురాలు అని పొగిడారు. కానీ ఫుల్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టిన వారికి ఇది పెద్ద విషయమే కాదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు