పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో గతంలో ‘జల్సా’ వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న సినిమా తాత్కాలిక టైటిల్ ‘అత్తారింటికి దారేది’. త్వరలో వారిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని తాజా సమాచారం. ఆ సినిమా టైటిల్ ‘కోబలి’. ఈ విషాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ లది మంచి కాంబినేషన్ అని అందరికి తెలుసు. వీరిద్దరూ వారి అంచనాలకు తగ్గట్టుగా సినిమాని నిర్మిస్తారు. ఇలాంటి జంట మరో సినిమా నిర్మిస్తున్నరంటే ఆశ్చర్య ఏమిలేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఈ సినిమా ఎప్పుడు మొదలుకానుంది? ఆ సినిమాలో సమాచారం ఏమిటి ? ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించగానే తెలియజేస్తాం.