వీరిద్దరి తర్వాత తారక్ లిస్ట్ లో ఈ టాప్ దర్శకులు.?

maghia

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ వండర్ లో మరో లీడ్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తారక్ దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో “అయినను పోయి రావలె హస్తినకు” అనే ప్రాజెక్ట్ ను కూడా ఒకే చేసారు.

అలాగే దీని తర్వాత కూడా మరో మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఓ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ను తారక్ ఒకే చేసారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ అనంతరం తారక్ తో సినిమా చేసేందుకు మరో ముగ్గురు దర్శకులు లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా అంతకు ముందు తారక్ తో అద్భుతమైన సినిమాలు తీసిన దర్శకులే అని తెలుస్తుంది. వారిలో కొరటాల శివ మరియు సుకుమార్ ల పేర్లు ఎక్కువగా ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Exit mobile version