రాముడు వచ్చేశాడు.. ఇక హనుమాన్ కూడా వచ్చేస్తున్నాడు..!

రాముడు వచ్చేశాడు.. ఇక హనుమాన్ కూడా వచ్చేస్తున్నాడు..!

Published on Jul 3, 2025 5:01 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ హిస్టారికల్ ఎపిక్ చిత్రం ‘రామాయణ’ ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ అంచనాలు అందుకునేలా ఫస్ట్ గ్లింప్స్ కూడా ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

‘రామాయణ’తో రాముడు రావణాసురుడు మధ్య జరిగే యుద్ధాన్ని మనకు చూపెట్టేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, నేడు రాముడు ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ అందించడంతో, ఇప్పుడు హనుమాన్ కూడా ఇదే బాటలో వచ్చేందుకు సిద్ధమయ్యాడట. టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ చిత్రం ‘జై హనుమాన్’. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే, ఈ సినిమా నుంచి కూడా ఓ సాలిడ్ అప్డేట్ ఈ నెలలో రానున్నట్లు తెలుస్తోంది. ‘జై హనుమాన్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. జూలై 7న రిషబ్ శెట్టి పుట్టినరోజు కానుకగా ‘జై హనుమాన్’ నుంచి ఓ ట్రీట్ రానుందనే వార్త సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దీంతో ప్రేక్షకులు ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు