నిన్న పుష్ప చిత్ర నిర్మాతలు ఓ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఈ మూవీలో వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ రష్మిక మాత్రమే, మరో హీరోయిన్ కి కథలో అసలు స్కోప్ లేదని చెప్పడం జరిగింది. పుష్ప సినిమాలో రష్మిక పాత్రకు అంత ప్రాధాన్యం ఉండదు అని వస్తున్న పుకార్లలో నిజం లేదని తెలిసిపోయింది. పుష్ప కథలో ఆమెది కీలక రోల్ కావడంతో పాటు, బన్నీ లవర్ గా కనిపిస్తుందని అర్థం అవుతుంది. ఇక రష్మిక ఈ చిత్రంలో లేడీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్ చేస్తుంది అనేది కూడా అవాస్తవం అని తెలిసిపోయింది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప కావడం విశేషం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ రాయలసీమకు చెందిన లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీకి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ విడుదల కానుంది.