త్రివిక్రమ్ నెక్స్ట్ చిరు, చరణ్ లలో ఒకరు..?

అల వైకుంఠపురంలో మూవీ సక్సెస్ త్రివిక్రమ్ ని మళ్ళీ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి తీసుకువచ్చింది. ఆయన ఈ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఇక సక్సెస్ వెనుక పరుగెత్తే స్టార్ హీరోలు ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఎన్టీఆర్ సైతం క్రేజీ డైరెక్టర్స్ ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా కాదని.. త్రివిక్రమ్ నే ఎంచుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం మే నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తారు అనే విషయంపై ఇప్పటి నుండే చర్చ మొదలైంది. ఇక మెగా ఫ్యామిలీతో బాగా సన్నిహితంగా ఉండే త్రివిక్రమ్ మెగా హీరోలతోనే సినిమా చేస్తారు అని గట్టిగా వినిపిస్తుంది. ఇక మెగా హీరోలు సైతం త్రివిక్రమ్ ని బయటకి వదిలేలా కనిపించడం లేదు. మళ్ళీ బన్నీ, పవన్ లేదా చిరు, చరణ్ లతో ఆయన సినిమా చేసే అవకాశం కలదు. ఐతే మెగాస్టార్ చిరంజీవి మరియు చరణ్ లతో త్రివిక్రమ్ ఇంత వరకు సినిమా చేయలేదు. కాబట్టి నెక్స్ట్ త్రివిక్రమ్ చిరు, చరణ్ లలో ఒకరితో మూవీ చేసే అవకాశం కలదు.

Exit mobile version