మీ సేవలు అసాధారణమైనవి.. మీరు లెజెండ్ సర్ – మెగాస్టార్

మీ సేవలు అసాధారణమైనవి.. మీరు లెజెండ్ సర్ – మెగాస్టార్

Published on Apr 17, 2020 7:25 PM IST

కరోనా నుండి తెలుగు సినీ కార్మికులకు ఉపశమనం కలిగించడానికి మెగాస్టార్ సారథ్యంలో ఏర్పడిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కు టాలీవుడ్ తారలు మరియు ప్రొడక్షన్ హౌస్‌ ల నుండి ప్రముఖ నిర్మాతలు ఉదారంగా విరాళం ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా రామోజీ రావుగారు కూడా పది లక్షలు విరాళంగా అందించారు. ఈ విషయం గురించి మెగాస్టార్ ట్వీట్ చేస్తూ.. ‘శ్రీ రామోజీ రావుగారు కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ .10 లక్షలు విరాళంగా అందించారు. మీ ఉదారమైన సహాయానికి ధన్యవాదాలు సర్, రోజువారీ వేతన చిత్ర కార్మికుల ప్రయోజనం కోసం సహాయం అందించినందుకు మీకు రుణపడి ఉంటాము. ఈ పరిశ్రమకు మీరు అందిచిన సేవలు అసాధారణమైనవి. మీరు ఒక లెజెండ్ సర్. అంటూ చిరు పోస్ట్ చేశారు.

కాగా క‌రోనా వ్యాప్తి నిరోధం విష‌యంలో రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తున్నాయి. ప్ర‌భుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌జ‌లంద‌రూ తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని పలువురు సినీ ప్రముఖులు కోరారు. కుటుంబాల‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ పోలీసులు, వైద్య సిబ్బంది అలుప‌నేది లేకుండా ప్ర‌జ‌లకు సేవ చేస్తున్నారు. వాళ్ల శ్ర‌మ వృథా కాకుండా ఉండాలంటే.. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాలి, మరి ఇంకా ఎంతమంది తారలు దేశం కోసం తమ వంతు కృషి చేయడానికి ముందుకు వస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు