9 సంవత్సరాల క్రితం చంద్ర సిద్దార్థ్ డైరెక్షన్లో, ప్రేమ కుమార్ పాత్రా నిర్మాతగా వచ్చిన ‘ఆ ఆనలుగురు’ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నంది అవార్డు తో పాటు పలు అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ఆ సినిమా నిర్మాత ప్రేమ కుమార్ మరో సినిమా నిర్మాణానికి శ్రీ కారం చుట్టారు. ఈ సినిమాకి ‘ఆ అయిదుగురు’ అనే టైటిల్ ని ఎంచుకున్నారు. అనిల్ గూడూరు డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో ‘కెరటం’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన సిద్దార్థ్ రాజ్ కుమార్ హీరోగా కనిపించనున్నాడు. అలాగే బొత్సా సత్యనారాయణ బంధువు అయిన రంజిత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకూ పాటల రచయితగా అందరికీ పరిచయమున్న సుద్దాల అశోక్ తేజ డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమా జనవరి 21 న లాంచనంగా ప్రారంభం కానుంది.