టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘డకాయిట్’ మూవీ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. హీరో అడివి శేష్ నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు షేనియెల్ డియో డైరెక్ట్ చేస్తున్నాడు. పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర సెట్స్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా హీరో అడివి శేష్‌తో పాటు మృణాల్ ఠాకూర్‌కు గాయాలు అయ్యాయని తెలుస్తోంది. అయితే, వారు గాయాలతోనే షూటింగ్ ముగించినట్లు సినీ సర్కిల్స్ టాక్.
ఈ సినిమా షూటింగ్ అనంతరం వారు గాయాలకు చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డకాయిట్ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.