కిస్ సినిమా విజయంపై నమ్మకంతో వున్న అడివి శేష్

కిస్ సినిమా విజయంపై నమ్మకంతో వున్న అడివి శేష్

Published on Jul 23, 2013 10:50 PM IST

Kiss
‘కిస్’ సినిమా తెరకెక్కిన విధానంపై హీరో అడివి శేష్ చాలా ఆనందంగా వున్నాడు. సినిమాకు ‘కీప్ ఇట్ సింపుల్ స్టుపిడ్’ అనేది ట్యాగ్ లైన్. అడివి శేష్ సరసన ప్రియా బెనర్జీ మొదటిసారిగా ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తుంది. ఈ సినిమాను చాలా భాగం సాన్ ఫ్రాన్సిస్కోలో తీసారు. అడివి శేష్ సినిమాను సొంతంగా నటించి దర్శకత్వం వహించాడు. సాయి కిరణ్ అడవి నిర్మాత. నిర్మానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. షానీల్ డియో సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కించాడు.
తన జీవతంలో ఇప్పటివరకూ ముద్దు రుచి ఎరుగని హీరోయిన్ ఇండియానుంచి వచ్చిన హీరోను కలిసాక ఎలాంటి మార్పులు చేసుకున్నాయి అని చెప్పే సినిమా. సాయిచరణ్ పాకల మరియు పేటె వండర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇంటర్నెట్ లో విడుదలైన టైటిల్ ట్రాక్ సంచనలం సృష్టించింది. ఈ సినిమా ఆగష్టులో విడుదలకానుంది

తాజా వార్తలు