ఈ సీన్స్ తోనే “ఆదిపురుష్” మొదలు.?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ఉన్న మూడు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో “ఆదిపురుష్” కూడా ఒకటి. ఏకంగా మన దేశపు ఇతిహాసం మీద తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ భారీ ప్రాజెక్ట్ పై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని హిందీ మరియు తెలుగు రెండు భాషల్లో తెరకెక్కించనున్నారు. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ బాట పట్టనుండగా మొదట ఏ సీన్స్ తో మొదలు కానుందో తెలుస్తుంది.

ఈ చిత్రంలో మేజర్ పార్ట్ ఎక్కువ వి ఎఫ్ ఎక్స్ తోనే ఉండనుంది. ఇపుడు అందుకు సంబంధించిన షాట్స్ ఇండోర్ లోనే తీసి ఆ తర్వాత అవుట్ డోర్ షూట్ తో మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. అలాగే ఈ చిత్రానికి ఒక్క విజువల్ ఎఫెక్ట్స్ కోసం మాత్రమే 250 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో లంకేశునిగా సైఫ్ అలీ ఖాన్ ఫిక్స్ అయ్యినట్టు తెలిసిందే. మొత్తం ఐదు భాషల్లో విడుదలకు ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని 3డి లో విడుదల చేయనున్నారు.

Exit mobile version