31న విడుదల కానున్న “అధినాయకుడు”?

31న విడుదల కానున్న “అధినాయకుడు”?

Published on May 21, 2012 6:32 PM IST


తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం “అధినాయకుడు” చివరికి మే 31న విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రం చుట్టూ ఉన్న వివాదాలన్నీ సమసిపోయినట్టు తెలుస్తుంది డాక్టర్ దాసరి నారాయణ రావు మరియు చిత్ర బృందాలు ఈ వివాదాల గురించి మీటింగ్ ఏర్పాటు చేసి సంభందిత వర్గాల నడుమ ఉన్న వివాదాలను పరిష్కరించారు. సలోని మరియు లక్ష్మి రాయ్ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపిస్తుండగా బాలకృష్ణ మూడు విభిన్న పాత్రలలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఎం ఎల్ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు