టాప్ 5 మ్యూజిక్ ఆల్బమ్స్ లోఒకటిగా నిలుస్తుంది – సుశాంత్

టాప్ 5 మ్యూజిక్ ఆల్బమ్స్ లోఒకటిగా నిలుస్తుంది – సుశాంత్

Published on May 5, 2013 12:30 PM IST

Adda
సుశాంత్, శాన్వి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ‘అడ్డా’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సాయి కార్తీక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని శ్రీ నాగ్ క్రియేషన్స్ బ్యానర్ పై చింతలపూడి శ్రీనివాసరావు, నాగ సుశీల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొన్ని పాటల మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యింది. త్వరలోనే రెండు పాటలను స్విట్జర్లాండ్ లో షూట్ చేయనున్నారు. ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ‘అడ్డా’ ప్రోమో సాంగ్ ని లాంచ్ చేసారు. ఈ కార్యక్రమానికి సుశాంత్, కార్తీక్, అనూప్ రూబెన్స్, నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు.

చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ సినిమా బాగా వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. కార్తీక్ అనుకున్న కథకి పూర్తి న్యాయం చెస్తున్నాడు. సుశాంత్ సరికొత్తగా కనిపిస్తాడు. ‘యెహీ హై మేరా అడ్డా’ అనే పాట సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేలా ఉంటుందని’ అన్నాడు. కార్తీక్ మాట్లాడుతూ ‘ ప్రోమో సాంగ్ షూట్ చెయ్యాలనేది సుశాంత్ ఐడియా. అలాగే హీరో పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చిన నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాసరావు గారికి నా ధన్యవాదాలు’ అని అన్నాడు. సుశాంత్ మాట్లాడుతూ ‘ టీం అందరి సహాయం లేకపోతే ప్రోమో సాంగ్ అంత బాగా వచ్చేది కాదు. ఈ సంవత్సరం టాప్ 5 మ్యూజిక్ ఆల్బమ్స్ లో అడ్డా కూడా ఒకటి అవుతుందన్న నమ్మకం ఉందని’ అన్నాడు. ఈ నెలాఖరులో ఆడియోని రిలీజ్ చేసి జూన్ లో మూవీని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

CLICK HERE FOR SONG PROMO

తాజా వార్తలు