సుశాంత్ తాజా సినిమా ‘అడ్డా’ జూలైలో విడుదలకు సిద్దంగావుంది. షన్వి హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నాగ్ కార్ప్ బ్యానర్ లో చింతలపూడి శ్రీనివాసరావు మరియు నాగ సుశీల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి కార్తీక్ రెడ్డి దర్శకుడు. రెండు పాటలు చిత్రీకరణ కోసం చిత్ర బృందం స్విట్జర్లాండ్ వెళ్లారు. ఈ సినిమా తెరకెక్కుతున్న విధానంపై సుశాంత్ ఆనందంగా వున్నాడు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగించుకుని నిర్మానంతర కార్యకరమలలొ బిజీగావున్నారు. నాలుగు సంవత్సరాల తరువాత సుశాంత్ నటిస్తున్న సినిమా కావడంతో బృందమంతా కష్టపడి పనిచేస్తున్నారు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ నెల 22న శిల్పకళా వేదికలో విడుదలకానుంది. ఈ వేడుకలో సుశాంత్, షన్వి మరియు శ్వేత భరద్వాజ్ చేసే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.