రేపే పవన్ కళ్యాణ్ థాంక్యూ ఫంక్షన్

AD_Posters
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ సృష్టిస్తోంది. ఈ సినిమా నిన్నటి కలెక్షన్స్ వరకు చూసుకుంటే కృష్ణా జిల్లాలో దాదాపు 3 కోట్ల మార్క్ కి చాలా దగ్గరలో ఉంది. మూడవ వారంలో కూడా కలెక్షన్స్ బాగా వస్తుండడంతో ఈ సినిమా త్వరలో మరిన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ కి ముందే పైరసీకి గురవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతర హీరోల అభిమానులు మరియు ప్రొడక్షన్ టీం పైరసీని అడ్డుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఈ విషయంలో అభిమానులందరికీ థాంక్స్ చెప్పుకోవడానికి ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ‘థాంక్యూ ఫంక్షన్’ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ వేడుక రేపు శిల్పకళావేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు.

అది కాకుండా పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కలిసి పవన్ ఫార్మ్ హౌస్ లో మా టీవీకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ప్రోగ్రాం కూడా రేపే మా టీవీలో ప్రసారం కానుంది, ఆ తర్వాత మిగతా చానల్స్ ప్రసారం చేస్తాయి.

Exit mobile version