50 రోజులు పూర్తి చేసుకోనున్న ‘అత్తారింటికి దారేది’

50 రోజులు పూర్తి చేసుకోనున్న ‘అత్తారింటికి దారేది’

Published on Nov 12, 2013 6:48 PM IST

AD_50_Days_Wallpapers-(3)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయాన్ని సాదించింది. ఈ సినిమా ఇప్పటివరకు తెలుగు సినిమాలలో ఏ సినిమా సాదించలేని కలెక్షన్ లను సాదించి రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా 50 రోజుల మార్క్ ను చేరుకొనుంది. ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాదించడంతో ఈ సినిమా టీం చాలా సంతోషంగా వున్నారు. ఈ నెల 16తో ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమా విడుదలకు ముందే మొదటి సగం ఇంటర్నెట్ ద్వారా విడుదల కావడంతో నిర్వాహకులు చాలా భాధపడ్డారు. కానీ ఇది బాక్స్ ఆఫీసు వద్ద సినిమాపై ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది.సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సందర్భంగా ‘అత్తారింటికి దారేది’ సినిమా టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు