మీకు బుల్లితెరపై వచ్చే సీరియల్స్ లో హీరో, హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలనుందా? మీ కెరీర్ ని ప్రారభించడం కోసం ఓ అద్భుతమైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అలాంటి బంపర్ ఆఫర్ ఇస్తోంది..
మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఈ టీవీలో ప్రతి రోజు రాత్రి 7:30 నిమిషాలకు ప్రసారమయ్యే సీరియల్ ‘మనసు మమత’. ఈ సీరియల్ మొదలైన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. రెండు సంవత్సరాలకు పైగా వారి ఆదరాభిమానాలను చూరగొంటూ విజయపథంలో దూసుకుపోతున్న ‘మనసు మమత’ సీరియల్ జూన్ 22వ తేదీకి 750 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోనుంది. ఇలాంటి సూపర్ హిట్ సీరియల్ లో నటించడానికి హీరో, హీరోయిన్ కావలెను.
ఈ అవకాశం దక్కించుకోవడానికి మీలో ఉండాల్సిన క్వాలిటీస్ :
1. చూడగానే ఆకట్టుకునేలా ఉండే పర్సనాలిటీ.
2. నటించాలన్న ఆసక్తి మరియు ఇది వరకు నటించిన అనుభవం ఉండాలి.
3. తెలుగులో బాగా మాట్లాడే వాక్ చాతుర్యం ఉండాలి.
4. కష్టపడి పనిచేయడం మరియు చెప్పిన దానిని తొందరగా నేర్చుకునే ఆసక్తి ఉండాలి.
మేము చెప్పిన ఈ క్వాలిటీలు అన్నీ మీలో ఉన్నాయనుకుంటే వెంటనే మీ ఫోటోలను, వాటితో పాటు మీ పూర్తి వివరాలు పొందు పరిచిన రెస్యూమ్ ని ఈ క్రింది మెయిల్ ఐడికి పంపండి.
ఈ మెయిల్ ఐడి : [email protected]
మీరు పంపాల్సిన ఫోటో వివరాలు : ఫుల్ సైజు ఫోటో, మీడియం ఫోటో, క్లోజ్ అప్ ఫోటోలు పంపండి.
గమనిక : పైన చెప్పిన విభాగాల్లో అనుభవం లేని వారు ఎవరన్నా అప్లై చేస్తే వారిని ట్రైనీ స్థానాల్లో తీసుకుంటారు.
ఈ మెయిల్ ఐడికి ఫోటోలు పంపలేని వారు మీ మీ ఫోటోలను, వాటికి మీ వివరాలను జత చేసి క్రింది తెలిపిన అడ్రస్ కి పోస్ట్ లేదా కొరియర్ చేయండి.
Mallemala Entertainments Pvt. Ltd,
Television Shows Department,
Sabdaalaya Complex,
Plot no – 5, L.V. Prasad Maarg,
Banjaara Hills, Beside Cinemax Multiplex,
Hyderabad – 500034