ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న బ్యూటీ.. ఫిదా అవుతున్న కుర్రాళ్లు..!

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న బ్యూటీ.. ఫిదా అవుతున్న కుర్రాళ్లు..!

Published on Nov 11, 2025 8:00 PM IST

సోషల్ మీడియాలో కొందరు స్టార్స్ తమ జీవిత కాలంలో తెచ్చుకోలేని గుర్తింపు కేవలం ఒక్క నైట్‌లో సాధించిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఫేమ్ ఓ సీరియల్ నటికి వచ్చింది. మరాఠి భాషల్లో పలు సీరియల్స్, సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్‌లో నటించింది నటి ‘గిరిజ ఓక్’. ఈ పేరు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఆమెను ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మార్చేసింది.

స్కై బ్లూ శారీకి మ్యాచింగ్‌గా స్లీవ్ లెస్ వైట్ బ్లౌజ్‌తో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడింది. ఇక ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గిరిజ ఓక్ గురించి కుర్రాళ్లు నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అయితే, ఆమె వయసు 37 అని తెలుసుకుని వారు షాక్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు