సిని నటి అంజలి కనబడకుండా పోవడం ఇండస్ట్రీ మొత్తాన్ని కలవరపరిచింది. చివరిగా ఈ విషయం సుఖాంతం అయ్యింది. ఇప్పటి వరకు అజ్ఞాతంలో వున్న అంజలి పశ్చిమ జోన్ డిసిపీ సురేంద్ర బాబును కలిసింది. గత కొద్దిరోజులుగా ఆమె ఎక్కడ వున్నది, ఏం చేసింది అనే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారని సమాచారం. అంజలి తన పిన్ని, తమిళ డైరెక్టర్ పై ఆరోపించిన ఆరోపణలు, తను అదృశం కావడానికి గల కారణాలు, తరువాత జరిగిన విషయాలన్నింటికి సమాదానం తెలియాల్సి వుంది. ఈ విషయాలపై అంజలి అధికారికంగా ప్రకటన చేస్తుందని ఇండస్ట్రీ వారు బావిస్తున్నారు.