సత్యదేవ్ షాకింగ్ మేకోవర్.. ‘రావు బహదూర్’ గా ఊహించని అవతార్ లో

మన టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాలెంటెడ్ అండ్ అండర్ రేటెడ్ నటుల్లో సత్యదేవ్ కూడా ఒకరు. తన బ్లఫ్ మాస్టర్ సినిమా తర్వాత చాలామంది తన నటనకి ఫిదా అయ్యారు. రీసెంట్ గా జీబ్రా సినిమాతో ఆకట్టుకున్న సత్యదేవ్ నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తున్న వారికి సమాధానం అన్నట్టుగా తన లేటెస్ట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కనిపిస్తుంది.

“రావు బహదూర్” అంటూ ఒక షాకింగ్ మేకోవర్ ని సత్యదేవ్ చేసి చూపించాడు. కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఒక ముసలి రాజుగా ఇంకా చెప్పాలంటే తాతగా, ముసలి భూతంగా తాను కనిపిస్తున్నాడు. ఇంకా తన లుక్ లో చిన్న చిన్న పిల్లలు కూడా కూడా కనిపిస్తున్నారు. అంటే ఇదేమన్నా ఫాంటసీ డ్రామానా అన్నట్టు కూడా ఉంది. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా చేస్తున్న సినిమా ఇది కాగా అనుమానం పెనుభూతం అనే లైన్ తో హైలైట్ చేస్తున్నారు.

దీనితో మాత్రం సత్యదేవ్ నుంచి ఏమైతే కోరుకుంటున్నారో మళ్ళీ మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో వెంకటేష్ ప్రెజెంట్ చేయబోతున్నాడు అనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఏ ప్లస్ ఎస్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో రాబోతుంది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version