డైరెక్టర్ కొరటాల శివ ఓ వెబ్ సిరీస్ తో నిర్మాతగా మారబోతున్నారని ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ లోకల్లా బాగా వినిపించిన రూమర్.. టినేజ్ లవ్ వల్ల లైఫ్ ఎలా డిస్టర్బ్ అవుతుందనే పాయింట్ మీద కొరటాల కథను రాసాడనేది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో హీరో కూడా ఫిక్స్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. సత్యదేవ్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తన అసిస్టెంట్ కి దర్శకత్వం అవకాశం ఇస్తూ కొరటాల ఈ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నాడట.
కాగా ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆచార్య షూటింగ్ ప్లానింగ్ లో ప్రస్తుతం కొరటాల ఉన్నాడు. ఇక తన శైలిలోనే ఈ సినిమా సాగనుంది. రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అక్రమాలను అన్యాయాలను చూపిస్తూ.. మంచి మెసేజ్ తో ఈ సినిమా ముగుస్తుందట. ఇక గవర్నమెంట్ ఆఫీసర్ గా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. చరణ్ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నవంబర్ సెకెండ్ వీక్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ తీస్తారట.