భర్తతో విడాకులు.. నెలకు రూ.40 లక్షలు అడిగిన హీరో భార్య!

భర్తతో విడాకులు.. నెలకు రూ.40 లక్షలు అడిగిన హీరో భార్య!

Published on May 21, 2025 6:01 PM IST

ప్రస్తుత కాలంలో భార్యభర్తలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్‌లో తమ రిలేషన్‌కు తక్కువ సమయంలోనే ఫుల్ స్టాప్ పెడుతున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. అటు సుదీర్ఘంగా కొనసాగించిన తమ బంధాన్ని కూడా మనస్పర్థల కారణంగా తెగతెంపులు చేసుకుంటున్నారు కొందరు. అయితే, ఇటీవల ఓ హీరో భార్య అతనికి విడాకులు ఇచ్చి తమ 15 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది.

తమిళ హీరో జయం రవి, అతని భార్య ఆర్తి ని 2009లో వివాహం చేసుకున్నాడు. వారి దాంపత్యం 15 ఏళ్ల పాటు సంతోషంగా సాగింది. అయితే, వారి మధ్య తలెత్తిన మనస్పర్థలు గొడవలకు దారి తీశాయి. దీంతో జయం రవి తన భార్య ఆర్తి కి విడాకులు ఇచ్చాడు. అయితే, ఇప్పుడు జయం రవి పై ఆర్తి కోర్టులో కేసు వేసింది. తనకు అతని నుంచి భరణంగా నెలకు రూ.40 లక్షలు ఇవ్వాలంటూ ఆమె తన విడాకుల కేసులో పేర్కొంది.

ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నెలకు రూ.40 లక్షల భరణం అనే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ అంశంపై జయం రవి ఎలా స్పందిస్తాడు.. తన భార్య ఆర్తి కోరుకున్నట్లు అంత భారీ మొత్తంలో భరణాన్ని చెల్లిస్తాడా.. అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు