2డి – 3డిలలో విడుదలకానున్న ‘యాక్షన్’ సినిమా

Action-3d

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ‘యాక్షన్’ సినిమా ఆంద్ర ప్రదేశ్ లో 2డి మరియు 3డి రెండింటిలో విడుదల చేయనున్నారు. 3డి ఫార్మేట్ నిర్మించిన సినిమాని కొన్ని మంచి క్వాలిటీ గల కొన్ని థియేటర్స్ లో మాత్రమే విడుదల చేయనున్నారు. 2డి ఫార్మేట్ సినిమాని మాత్రం సాద్యమైనన్ని ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేయాలనీ చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాని మే లో విడుదలైయ్యే అవకాశం వుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్, వైభవ్, ‘కిక్’ శ్యాం, రాజు సుందరంలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. స్నేహ ఉల్లాల్, కామ్న జఠ్మలాని, నీలం ఉపాధ్యాయ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి బప్పి లాహిరి సంగీతాన్ని అందించాడు. అనిల్ సుంకర దర్శకత్వం వహించి నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

Exit mobile version