యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ బన్నీ అంటే బాలీవుడ్ స్టార్స్ కి ఎందుకు ఇష్టమో ఒక్క మాటలో చెప్పారు. ఎందుకంటే ఆయన అద్భుతం అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా లో వెలువడిన ఓ ఆర్టికల్ కి సమాధానంగా ఆయన ఇలా స్పందించారు. అల వైకుంఠపురంలో మూవీలో బుట్ట బొమ్మ సాంగ్ చూసి బాలీవుడ్ స్టార్స్ అయిన శిల్పా శెట్టి, దిశా పటాని మరియు హృతిక్ రోషన్ బన్నీని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఇటీవల ప్రముఖ డైరెక్టర్ సంజయ్ గుప్త అల వైకుంఠపురంలో మూవీ అద్భుతం అని, బన్నీ ఒక్క ఛాన్స్ ఇస్తే మూవీ చేస్తాను అన్నారు.
ఈ విషయాలను ప్రస్తావిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ‘ బాలీవుడ్ స్టార్స్ కి బన్నీ అంటే ఎందుకు అంత ఇష్టం ?’ అని ఓ కథనం రాయడం జరిగింది. దానికి సమాధానంగా హీరో జమాల్ ఇలా స్పందించారు. మరి పుష్ప మూవీతో అల్లు అర్జున్ మొదటిసారి బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. అక్కడ ఏస్థాయి ఆదరణ దక్కించుకుంటాడో చూడాలి.