ప్రస్తుత ఇండస్ట్రీ ట్రెండ్ యాక్షన్ కామెడీ సినిమాలే – విష్ణు మంచు

VishnuManchu
మంచు వారబ్బాయి మంచు విష్ణు హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కానీ ఆయన ఇప్పటి వరకు చేసిన 10 సినిమాల్లో నటించారు. అందులోనూ ఆయనకు బాగా గుర్తింపు తెచ్చింది మాత్రం ‘డీ’, ‘దేనికైనా రెడీ’ లాంటి యాక్షన్ కామెడీ సినిమాలే. విష్ణు కొత్త సినిమా ‘దూసుకె ళ్తా’. ఈ మూవీ కూడా యాక్షన్ కామెడీ సినిమానే కావడం విశేషం.

ఇటీవలే విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎందుకు యాక్షన్ కామెడీ తరహా సినిమాలే ఎక్కువ చేస్తున్నారని అడిగితే ‘ నేను మొదట్లో యాక్షన్ తరహా సినిమాలే చేసాను. అవి బాక్స్ ఆఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాతే నన్ను ఆడియన్స్ యాక్షన్ కామెడీ తరహా మూవీల్లోనే చూడటానికి ఇష్టపడతారని తెలుసుకున్నాను. యాక్షన్ కామెడీ సినిమాలు నేనొక్కడినే చేయడం లేదు. అందరు హీరోలు చేసారు లేదా కొంతమంది ప్రస్తుతం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న ట్రెండ్ ఇదే. అలా అని వేరే సినిమాలు చెయ్యనని కాదు మంచి కథ దొరికితే వేరే తరహా సినిమాలు కూడా చేస్తానని’ విష్ణు అన్నారు.

లావణ్య త్రిపతి హీరోయిన్ గా నటించిన దూసుకెళ్తా సినిమాకి వీరు పోట్ల డైరెక్టర్. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version