కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన బిగ్ బడ్జెట్ ఎంటర్టైనర్ సినిమా ‘యాక్షన్ 3డి’. ఈ సినిమా జూన్ 14న భారీగా విడుదలకు సిద్దమవుతోంది. ఇండియాలోనే మొదటి కామెడీ 3డి సినిమా ఇది. ఈ సినిమాని హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు. అనిల్ సుంకర దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ సినిమాలో అల్లరి నరేష్, ‘కిక్’ శ్యాం, వైభవ్, రాజు సుందరంలు అలాగే నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలని, స్నేహ ఉల్లాల్, షీనాలు హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇది అల్లరి నరేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా. సునీల్, పోసాని కృష్ణ మురళి అతిధి పాత్రలో నటించిన ఈ సినిమాకి బప్పి లాహిరి, ఆయన కుమారుడు బప్పా లాహిరి సంగీతాన్ని అందించారు.